బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను అత్యాచారం చేస్తానంటూ బెదిరించిన లాయర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఆ న్యాయవాది తెలియజేయడంతోపాటు, కంగనపై పెట్టిన పోస్టింగ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు సదరు న్యాయవాది ఓ పోస్ట్ పెట్టారు.అలా పోస్ట్ పెట్టిన కొద్ది సమయానికే ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేశారు కూడా. ఆ వెంటనే ఆ లాయర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం.