పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసి తన సినిమా సెట్స్ పైకి రావడానికి సమయం పడుతుందని భావించిన క్రిష్ మధ్యలో లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా తీయాలనుకున్నాడు. అందుకే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమాను నవంబర్ నాటికి పూర్తి చేసి.. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని.. డిసెంబర్ మధ్యలో పవన్ సినిమా షూటింగ్ మొదలుపెట్టారని క్రిష్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని పవన్ కి కూడా చెప్పినట్లు సమాచారం. నవంబర్ నాటికి ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేస్తే డిసెంబర్ లో తమ సినిమా మొదలుపెడతామని క్రిష్.. పవన్ తో చెప్పారట. మరి క్రిష్ కోరుకుంటున్నట్లుగా డిసెంబర్ నాటికి పవన్ షూటింగ్ కి రెడీగా ఉంటాడో లేదో చూడాలి!