మంగళవారం ఆవిష్కరించిన ఒక సరికొత్త పోస్టర్, మోషన్ వీడియో ద్వారా ఈ సినిమా 2021 సంక్రాంతికి విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ పోస్టర్లో ఒక వైపు ఒక విరిగిన గోడ, రానా, విష్ణు విశాల్ కనిపిస్తుండగా, మరోవైపు ఏనుగులు కనిపిస్తున్నాయి. వృక్షాలు, అడవులను సంరక్షించమనే మెసేజ్‌ను ఈ పోస్టర్ ద్వారా ఇస్తున్నారు. “ప్రాణాంతక మహమ్మారిపై పోరాడుతున్న మనం, స్ఫూర్తి కోసం మన అడవుల వంక దృష్టి సారించాలి. భూమికి ఊపిరితిత్తుల్లాంటి మన అరణ్యాలు.. అటవీ నిర్మూలన, పారిశ్రామికీకరణ అనే విస్తరిస్తున్న మహమ్మారితో సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నాయి. వచ్చే 2021 సంక్రాంతికి, మీ సమీపంలోని థియేటర్‌కు వస్తున్న అరణ్యతో వాటిని కాపాడదాం” అని వారు పిలుపునిచ్చారు.