మరో రెండు రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేసే పనిలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో ‘రాధే శ్యామ్’ యూనిట్ కాస్త ముందుగా ఉందనే చెప్పాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘యూవీ క్రియేషన్స్’ ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.