రాధే శ్యామ్ కోసం ప్రభాస్ బాగా మేకోవర్ అయ్యారు. ఇటీవల అడవుల్ని దత్తత తీసుకున్న సందర్భంగా ప్రభాస్ బైటకొచ్చిన సందర్భంలో ఆ విషయం అర్థమైంది. ఇప్పుడు రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ తో మరింత్ క్లారిటీ వచ్చేసింది. అవును.. బాహుబలికోసం బాగా కండలు పెంచిన ప్రభాస్, సాహో కోసం అదే లుక్ మెయింటెన్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తనదైన స్టైలిష్ మేనరిజమ్ లోకి వచ్చేశాడు ప్రభాస్. రాధేశ్యామ్ లో మిర్చి సినిమా లుక్ క్యారీ చేయబోతున్నాడు.