మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్టయినట్లు తెలుస్తోంది.  గతంలో వీరిద్దరి కాంబినేనషన్లో బండ్ల గణేష్ ప్రొడ్యూసర్గా మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర్జున్ - వివి వినాయక్ ముఖ్య అతిథులుగా ఓ ప్రాజెక్టు స్టార్టయ్యింది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది.వీళ్లిద్దరూ ఎవరి ప్రాజెక్టులో వారు బిజీ అయిపోయారు. ప్రస్తుతం కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు కలసిసంయుక్తంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆచార్య సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.