డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. చేయాల్సిన సినిమా కూడా డైలమాలో పడింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చే సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా రకుల్ ఒప్పుకుంది. వాటి పరిస్థితి కూడా ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అటు బాలీవుడ్ లో కూడా ఈ భామ ప్రయత్నాలు చేసింది. అక్కడినుంచి కూడా ప్రోగ్రెస్ లేనట్టు తెలుస్తోంది.