అభిమానులకు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అదిరిపోయే బహుమతిని అందించేశాడు. `రామరాజు ఫర్ భీమ్` వీడియోను విడుదల చేశాడు. `ఆర్ఆర్ఆర్`లో కొమరం భీమ్‌గా చేస్తున్న ఎన్టీయార్ పాత్ర తీరుతెన్నులను పరిచయం చేస్తూ ఈ వీడియోను రూపొందించారు.`వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.  నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్` అంటూ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఎన్టీయార్ పాత్రను పరిచయం చేశారు. ఎన్టీయార్ పోరాట వీరుడిగా అద్భతంగా కనిపించాడు.ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓ రేంజ్ లో ఎలివేట్ అయ్యిందనే చెప్పాలి.