బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ఏడోవారం అనూహ్యంగా అరియానా తన ఓటింగ్ ని పెంచుకుంటోందా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. మనం ఏడోవారం చూసినట్లయితే.., మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో అభిజిత్ కి ఎప్పటిలాగానే ఓటింగ్ హ్యూజ్ గా వస్తోంది. అయితే, ఆ తర్వాత ప్లేస్ లో అరియానా ఉంది. అన్ అఫీషియల్ బిగ్ బాస్ పోలింగ్ ఓట్లలో అరియానాకి దాదాపు 25శాతం ఓటింగ్ జరుగుతోంది.