కేరళలోని ఆ ఆలయంలోకి వచ్చిన మొసలిని చూసి.. పూజారి కంగారు పడలేదు. భయంతో అటవీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఆ మొసలికి నమస్కారం పెట్టి బయటకు వెళ్లాలని కోరాడు. అంతే.. ఆ మొసలి ఆయన విని బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే, ఈ మొసలి క్రూరమైనది కాదు. మనుషుల మాట వింటుంది. మనుషుల కోసమే బతుకుతోంది. మాంసాహారం కూడా ముట్టదు. కసరగడ్ జిల్లాలో గల అనంతపురలో గల ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో జీవిస్తున్న ఈ శాఖాహార మొసలిని ‘బలియా’ అని పిలుస్తారు.