తెలుగుతో పాటు మలయాళం,కన్నడ, తమిళ భాషల్లో కలిపి 60కి పైగా సినిమాల్లో నటించింది సంగీత. ఇదిలా ఉండగా.. 2009 లో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ అయిన క్రిష్ ను పెళ్ళి చేసుకున్న సంగీత.. తరువాత సినిమాలను కాస్త తగ్గించిందనే చెప్పాలి. 3 ఏళ్ళ తరువాత.. ఈ ఏడాది విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది సంగీత. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన తల్లిగా నటించి మంచి వినోదాన్ని పంచింది సంగీత.