కాజల్ పెళ్లి జరగబోయేది ముంబయిలో.ఐతే స్టార్ హీరోల సంగతేమో కానీ.. యంగ్, అప్ కమింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కాజల్ పెళ్లికి హాజరు కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసిన కాజల్.. కెరీర్ చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో సీత, కవచం లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో వీళ్లిద్దరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన విషయం కొన్ని ఫొటోలను బట్టి తెలిసింది. కరోనా టైంలో కాజల్‌ను మిస్సవుతున్నట్లు కూడా శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు కాజల్ పెళ్లి గురించి శ్రీనివాస్ స్పందిస్తూ.. ''కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా కుటుంబంలోని వ్యక్తితో సమానం. కాజల్‌కు మంచి జీవిత భాగస్వామి దొరకడం సంతోషంగా ఉంది. గౌతమ్ గొప్ప వ్యక్తి. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. నేనిప్పుడు షూటింగ్లో ఉన్నాను. కానీ విరామం తీసుకుని కాజల్ పెళ్లికి హాజరు కావాలి. మిగిలిన పనుల కోసం తన పెళ్లికి దూరం కాలేను'' అని చెప్పాడు.