RRR నుంచి నిన్న కొమురం భీం ఇంట్రో టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్ లోని   కొన్ని షాట్లు ఎక్కడి నుంచో లేపుకొచ్చినవి అనే విషయాన్ని కొన్ని గంటల్లోనే నెటిజన్లు కనిపెట్టేశారు.కొమరం భీమ్ ఓ గిరిజన తెగకు చెందిన వాడన్న సంగతి తెలిసిందే. ఆయన జీవితంలో ఎక్కువ భాగం అటవీ ప్రాంత నేపథ్యంలోనే సాగింది.  టీజర్లో ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ అడవులకు సంబంధించిన విజువల్సే తీసుకున్నారు.ఐతే టీజర్లో ఒక చోట చూపించిన దట్టమైన అడవి మధ్యలో సూర్య బింబం విజువల్.. అలాగే వర్షంలో నీటి బిందువుల విజువల్.. ఇంకా అగ్నిపర్వతాన్ని చూపించిన దృశ్యం.. ఇవన్నీ కూడా రాజమౌళి టీం షూట్ చేసినవి కావు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌కు చెందిన ఒక వీడియో నుంచి అగ్నిపర్వతం విజువల్ తీసుకోగా.. ఇంకో రెండు చోట్ల నుంచి అడవి, నీటి బిందువల దృశ్యాలు తీసుకున్నారు.మనం ఇంటర్నెట్ అనే మహా సముద్రం నుంచి తీసుకున్నాం కదా.. దీన్నెవరు కనిపెడతారులే అని ఫిలిం మేకర్స్ అనుకుంటారు కానీ.. నెటిజన్లను తక్కువగా అంచనా వేస్తే కష్టమని గతంలో చాలాసార్లు రుజువైంది.