నటుడు రాజశేఖర్ ఆరోగ్యం పై చిరంజీవి స్పందించారు.ఇండ్రస్టీ లో ఉన్న సీనియర్ హీరోలుగా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే తన తోటి సీనియర్ హీరో, మరియు తన స్నేహితుడైన రాజశేఖర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఇటీవల చిరు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.  ఇక తాజాగాశివాత్మిక చేసిన ట్వీట్ పై చిరు స్పందిస్తూ, డియర్ శ శివాత్మిక, మీ ప్రియమైన నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా, ధైర్యంగా ఉండండి, అందరి ప్రార్థనలతో త్వరగా కోలుకుంటారు, మీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా అని చిరు పేర్కొన్నారు.చిరు చేసిన ట్వీట్ కు అభిమానులు సైతం స్పందిస్తున్నారు. మేము కూడా రాజశేఖర్ ఆరోగ్యం కోసం ప్రార్దిస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.