పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ టీజర్ దసరాకు రావాల్సి ఉంది. యూనిట్ నుంచి అధికారికంగా సమాచారం లేనప్పటికీ పవన్ ఫ్యాన్ గ్రూపుల్లో ఇంటర్నల్ గా ఈ విషయం పాకిపోయింది. మేకర్స్ కూడా దసరాకే అన్నీ అన్నట్టు రెడీ చేసుకున్నారు. కట్ చేస్తే, వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ వాయిదా పడింది. దసరాకు రావాల్సిన వకీల్ సాబ్ టీజర్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కుదిరితే దీపావళికి టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.