ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేసే దర్శకుడు పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఫైటర్ సినిమా కోసం మాత్రం ఎప్పుడూ లేని విధంగా సమయం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అందులోనూ పూరీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ జనాల్లో తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పూరీ కొంత ట్రాక్ మార్చి ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. సినిమాలు నింపాదిగా తీసే రాజమౌళిని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.