కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ‘బాహుబలి’ కి ఏకంగా 5 ఏళ్ళు కేటాయించాడు ప్రభాస్. అలాంటి టైం లో ఏ హీరో అంత ఓపికగా ఉండడు అనే చెప్పాలి.అదే సమయంలో 5,6 సినిమాలు చేసుకున్నా 100 కోట్ల వరకూ సంపాదించుకునే వాడు ప్రభాస్. కానీ ఎంతో డెడికేషన్ తో ఆ ప్రాజెక్ట్ చేసి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ‘సాహో’ విషయంలో కూడా ఇలాగే చేశాడు. ఇచ్చిన మాట కోసం ఓ కుర్ర డైరెక్టర్ సుజీత్ తో ఈ భారీ సినిమా చేసాడు.