కొరటాల శివతో ఎప్పటినుండో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు చరణ్. ఇప్పటికే ఓ సినిమా మొదలై ఆగిపోయింది. దీంతో ఈసారి కొరటాలతో ఎలాగైనా సినిమా చేయాలనుకుంటున్నాడు చరణ్. ‘ఆచార్య’ సినిమా తరువాత అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు కొరటాల. ఆ తరువాత చరణ్ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రమ్, కొరటాల సినిమాల కంటే ముందుగా రామ్ చరణ్ ఓ సినిమా చేయాలి. అది ఎవరితో చేయనున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.