రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్ అక్కడే తన పుట్టినరోజు కేక్ కట్ చేశారు. సినిమా యూనిట్ అంతా ప్రభాస్ తో కలసి ఫొటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం ఈ సెలబ్రేషన్స్ లో కనిపించలేదు. సహజంగా హీరోహీరోయిన్లు ఇద్దరూ షూటింగ్ లో ఉంటే.. కామన్ గా కలసి కేక్ కట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ పూజా మిస్సైంది. ఇంతకీ పూజా హెగ్డే ఇటలీకి ఇంకా చేరుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్టిల్స్ లో పూజా ఎక్కడని ప్రశ్నిస్తున్నారు.