ఆదిపురుష్'లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్ సరసన సీత ఎవరనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో పౌరాణిక ఇతివృత్తంతో ఈసినిమాను రూపొందించబోతున్నారు.  రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. అతడి సరసన నటించే నాయిక కోసం ప్రస్తుతం చిత్రబృందం వెతుకుతోంది. సీత పాత్ర కోసం కీర్తిసురేష్, కియారా అద్వాణీ,అనుష్కశర్మతో పాటు బాలీవుడ్, దక్షిణాదికి చెందిన అగ్రనాయికల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి ఎంపికచేస్తారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది..