ప్రభాస్ పుట్టినరోజుకు కూడా మహేష్ బాబు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రభాస్! మీకు అనంతమైన విజయం, ఆనందం అలాగే శాంతి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.. అని మహేష్ చాలా ఫ్రెండ్లిగా పేర్కొన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో అర్జున్ సినిమా ఈవెంట్ కి సంబంధించిన ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు. అప్పుడు ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు.అంతా బాగానే ఉంది.  కానీ మొదట ట్వీట్ చేసినప్పుడు మహేష్ బాబు ఒక పొరపాటు చేశాడు. ప్రభాస్ ఐడి అనుకోని ఎవరిదో ఫేక్ ఎకౌంట్ అడ్రస్ తో ట్యాగ్ చేశాడు. అయితే ప్రభాస్ కి ట్విట్టర్ ఎకౌంట్ లేకపోవడంతో ఆడియెన్స్ షాక్ అయ్యారు. ఆ ఎకౌంట్ ఓపెన్ చేయడంతో రాకేష్ అనే మరో పేరు చూపించింది. ఇక కొద్దీ సేపటికి తన పొరపాటు తెలుసుకున్న మహేష్ వెంటనే ట్యాగ్ తీసేశాడు.