అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ -2 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోకుండా కరోనా లాక్ డౌన్ వల్ల రెండు సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. టీజర్ల విడుదలలలో మాత్రం ఆర్ఆర్ఆర్ కాస్త ముందున్నా.. సినిమా విషయంలో మాత్రం కేజీఎఫ్ ముందుగా థియేటర్స్ లోకి వస్తుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ టీజర్లతో సందడి సృష్టించిన దర్శకుడు రాజమౌళి ఒకరకంగా కేజీఎప్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి పెంచాడు. దీంతో అటు హీరో యశ్ కూడా త్వరగా టీజర్ బైటకు వదలాలని దర్శకుడు ప్రశాంత్ పై ప్రెజర్ పెడుతున్నాడట. ఈ నేపథ్యంలో త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ వస్తుందని అనుకుంటున్నారు.