ఎన్టీఆర్ టీజర్ - భీమ్ ఇంట్రో వీడియో ఒక ఫైట్ విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చింది. ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ లో కనిపించనున్నాడు. సినిమా కోసం మజిల్డ్ బాడీ బిల్డ్ చేశాడు. అంతకంటే ఆసక్తికరమైన అంశమేమిటంటే... బేర్ బాడీతో అడవి పులి తో పోరాడే ఫైట్! అవును... 'ఆర్ఆర్ఆర్' టీజర్ ద్వారా పులితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొండు బెబ్బులిగా పోరాడతాడని ఫుల్ క్లారిటీ వచ్చింది. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. టీజర్లో 53 సెకన్ల దగ్గర ఎన్టీఆర్ బేర్ బాడీ చూపించాడు. బలంగా రెండు చేతులతో ఏదో లాగుతూ లింక్ కలపడానికి ప్రయత్నించాడు.అప్పుడు అక్కడ అతడి ఛాతీపై పులి పంజా వల్ల అయిన గాయం కనిపించింది.  సరిగ్గా గుండెల మీద మూడు గాట్లు ఉన్నాయి. దీంతో పులితో ఎన్టీఆర్ ఫైట్ కన్ఫర్మ్ అని క్లారిటీ వచ్చింది.