బన్నీ తన పిల్లలకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలలో షేర్ చేసి.. వాటిని తన అభిమానులతో పంచుకొంటూ వస్తున్నాడు..ఇప్పుడు మరోసారి బన్నీతాజాగా `ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ` అంటూ పిల్లలు టీవీ చూస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.ఈ వీడియోలో అయాన్, అర్హ లు టీవీ చూస్తూ డాన్స్ చేస్తూ ఉంటే... దానికి బన్నీ నవ్వుతూ ఆ సన్నివేశాల్ని వీడియో రూపంలో చిత్రీకరించి దాన్ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.  ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలలో ఎంతో వైరల్ గా మారింది.అయాన్, అర్హ ల క్యూట్ డాన్స్ మూమెంట్స్ కి బన్నీ ఫ్యాన్స్ తో పాటు.. నెటిజన్లు సైతం ఈ వీడియో చూసి మురిసిపోతున్నారు.