నటుడిగా కొత్త జీవితం మొదలుపెట్టిన తరువాత చాలా ఎక్స్ పోజర్ వచ్చిందని.. చాలా పరిశ్రమలు చూస్తున్నానని అన్నారు. కొత్త పాత్రలు చేయడం, చాలామంది కొత్త నటీనటులను కలుస్తుండడం .. తనకు బాగా నచ్చుతుందని.. డబ్బు అసలు ఇంపార్టెంట్ కాదని.. ఇప్పటివరకు తనకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేయలేదని అన్నారు. మొన్నామధ్య ఓ సినిమా ఫ్రీగా చేయడానికి కూడా రెడీ అయ్యానని.. కానీ వేరే కారణాల వలన ఆ సినిమా ఆగిపోయిందని చెప్పుకొచ్చారు.ఇలా తన రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చాడు జగపతిబాబు.