విరాళాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఇంత తక్కువ ఇస్తుంటారు ఏంటి? అని ఎంతో మంది దుమ్మెత్తు పొయ్యడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇలాంటి కామెంట్స్ చేసే వారికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ .. “సినిమా అనేది అందరి కృషి. బయటవాళ్ళకు.. సినిమా వాళ్ళ దగ్గర కోట్లకు కోట్లు ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఓ సినిమా పోతే.. నిర్మాత ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ‘ఆరెంజ్` సినిమా పోతే.. అన్నయ్య నాగబాబు ఆస్తుల్ని అమ్ముకున్నాడు. మేమంతా తలో చెయ్యి వేసి బయట పడేశాం. 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. కోటి మిగులుతుందని కూడా చెప్పలేం. కరోనా వల్ల.. పనులన్నీ ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఆ టైములో కూడా సినిమా వాళ్లు విరాళాలను అందించారు. ఇక్కడ మా పని కూడా ఆగిపోయింది. విరాళాలు ఇంత తక్కువ ఇస్తున్నారేంటి.. సరిపోవట్లేదు అనే వాళ్ళు.. తమ జేబులోంచి రూ.10 అయినా ఇచ్చారా? కష్టపడి సంపాధించుకునే వారికి రూ.10లక్షలు ఇవ్వాలంటే మనసు ఎలా వస్తుంది. ఇక్కడ జనాల దగ్గరేమీ డబ్బు ఎక్కువగా ఉండదు.రియల్ ఎస్టేట్, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల వంటి వారి దగ్గర ఉంటుంది నిజమైన సంపద” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.