‘ఇండియన్ 2’ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. దానికి కారణం ఏంటనేది తెలియడం లేదు. చిత్ర నిర్మాతల కారణంగానే సినిమా షూటింగ్ మొదలుకావడం లేదని కోలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. నిర్మాతల తీరుతో విసిగిపోయిన శంకర్.. వారికో లేఖ రాశారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఆలోచన ఉందా..? లేదా..? అంటూ ప్రశ్నించారట. త్వరగా షూటింగ్ మొదలుపెట్టకపోతే తాను మరో సినిమా చేసుకుంటానని హెచ్చరించారట.