ఐదోవారం అనూహ్యంగా ఎలిమినేట్ అయిన జోర్ధార్ సుజాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఆదివారం నాగార్జున బిగ్ బాస్ హోస్టింగ్ చేయట్లేదు. నాగ్ ప్లేస్ లో సమంత యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత జోర్ధార్ సుజాతని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతోందని అంటున్నారు.