మన జక్కన స్నేహితుడు మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన మరెవరో కాదు నిర్మాత సాయి కొర్రపాటి.. కీరవాణి చిన్న కొడుకు సింహాను కథానాయకుడిగా పెట్టి సినిమా తీయబోతున్నాడట.   ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడట. సింహా హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైంది ఒకే సినిమాతో. అదే.. మత్తు వదలరా. ఈ సినిమా తర్వాత కాలభైరవ సంగీత దర్శకుడిగా వరుసగా సినిమాలు చేసుకుపోతుండగా.. సింహా మాత్రం తర్వాత ఏ చిత్రం చేయలేదు. వీళ్లిద్దరితో కలిసి సాయి రంగంలోకి దిగుతున్నాడు. మరీ రీఎంట్రీలో అయినా ఆయనకు మంచి ఫలితాలొస్తాయేమో చూడాలి.