ఎన్టీఆర్ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా పాన్ ఇండియా మార్కెట్ ఉన్న సినిమానే కావాలనుకుంటున్నారు ఎన్టీఆర్. అయితే త్రివిక్రమ్ మాత్రం తారక్ కోసం ఓ మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రెడీ చేశారు. ఆర్ఆర్ఆ తర్వాత ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కథ విషయంలోనే తిరకాసు మొదలైంది. మొదట్లో కథకు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. రాను రాను సినిమా విషయంలో త్రివిక్రమ్ కు సలహాలు ఎక్కువగా చెబుతున్నారట. పాన్ ఇండియా సబ్జెక్ట్ లాగా దాన్ని రీరైట్ చేయాలని అంటున్నారట.