మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాకు సంబంధించి కొత్త టీజర్ విడుదలైంది. నాగార్జునను అఖిల్ ఫుల్లుగా ఇమిటేట్ చేయడమే ఈ టీజర్ ప్రత్యేకత. నిన్నే పెళ్లాడతా సినిమా టైమ్ లో నాగార్జున హావభావాలు ఎలా ఉండేవో.. సరిగ్గా ఇప్పుడు అఖిల్ అదే స్టైల్ ఫాలో అవుతున్నాడు. ఇన్నాళ్లూ తన సొంత మేనరిజమ్ తో వచ్చిన అఖిల్.. ఇప్పుడు నాగార్జునని పూర్తిగా ఇమిటేట్ చేయడం మొదలు పెట్టాడు. డైలాగ్ డెలివరీ నుంచి ఫేసియల్ ఎక్క్ ప్రెషన్స్, హ్యాండ్ మూమెంట్స్.. ఇలా అన్నిట్లో తండ్రిని గుర్తు చేస్తున్నాడు అఖిల్.