గత ఆరువారాలకి హోస్ట్‌గా ఉన్న నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం మనాలీ వెళ్ళగా, ఆయన స్థానాన్ని కోడలు సమంత భర్తీ చేస్తుంది. శనివారం ఎపిసోడ్ హోస్ట్ లేకుండా సాగిపోగా, ఆదివారం రోజు సమంత ఇంటి సభ్యలతో సందడి చేయనుంది. ఇప్పటికే బిగ్ బాస్ స్టేజ్‌పై సమంత చేసిన సందడికి సంబంధించి ప్రోమోలు విడుదల చేయగా, ఇవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.  దసరా సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం కానుంది.