ఫస్ట్ వీక్ లో హౌస్ మేట్స్ అందరి మనస్తత్వాలు కాచి వడబోసింది తప్పితే, తన గేమ్ ఏంటి అనేది ఆలోచించలేకపోయింది దివి. అంతేకాదు, ఎవరు ఏ విషయంలో వారి ప్రవర్తనని మార్చుకోవాలి అనేది మార్నింగ్ మస్తీలో చెప్పినపుడు దివికి బయట ఫాన్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ సిల్లీ రీజన్స్ చెప్తూ హౌస్ మేట్స్ ని నామినేట్ చేసినపుడు అది పోయింది. ఇంకో రీజన్ ఏంటంటే., హౌస్ మేట్స్ అందరితో కంటే అమ్మతోనే ఎక్కువగా ఉంది దివి. అంతేకాదు, అమ్మగేమ్ ని కూడా చాలాసార్లు ఇన్ఫులెన్స్ చేసింది కూడా. ఇక తనని లాస్ట్ వీక్ నామినేట్ చేసిన లాస్య కోసం తను శాక్రిఫైజ్ చేసి మరీ నామినేషన్స్ లోకి వచ్చింది. ఇది ఆడియన్స్ కి నచ్చుతుందిలే అని లైట్ తీస్కుంది. కానీ, ఆడియన్స్ కూడా ఓట్లు వేయడంలో లైట్ తీస్కుంటారని గెస్ చేయలేకపోయింది.