సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.12గా పవన్ ఓ సినిమా చేయబోతున్నారు. మలయాళ అప్పప్పన్ కోషియమ్ లో బిజు మేనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోసిస్తారు. పృథ్వీరాజ్ క్యారెక్టర్లో రానా నటిస్తాడని అంటున్నారు. ఇందులో పవన్ పేరు బిల్లా అనే వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన మరో కీలక పాత్రధారి రానా పేరు రంగా అవుతుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేస్తూ విడుదల చేసిన వీడియోలో బ్యాగ్రౌండ్లో ‘బిల్లా.. రంగా’ అనే వాయిస్ వినిపిస్తోంది. అలా ఇదే సినిమా పేరు అని నెటిజన్లు అనుకుంటున్నారు.