నాని హీరోగా అనౌన్స్ అయిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం నుంచి నిర్మాత నాగవంశీ వెన్కకి వెళ్లిపోవడంతో ఆ ప్రాజెక్ట్ మరో నిర్మాత వెంకట్ బోయినపల్లి చేతికి వెళ్లింది. ఈ చేతుల మారకం వెనక పెద్ద కథే నడిచిందని చెబుతున్నారు. ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతోనే నాగవంశీ తప్పుకున్నారని తెలుస్తోంది. ‘శ్యామ్ సింగ రాయ్’ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ. సహజంగానే ఇలాంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువ పెట్టాలి. అయితే నాని ఇమేజ్ కి ఈ ప్రాజెక్ట్ సరిపోతుందా, ఒకవేళ సరిపోయినా జనాలు నానిని యాక్షన్ రోల్ లో యాక్సెప్ట్ చేస్తారా అనే విషయంపై నిర్మాత డైలమాలో పడ్డారు. వి.. సినిమా రిజల్ట్ తో నానితో యాక్షన్ యాంగిల్ వర్కవుట్ కాదని తెలిసి నాగవంశీ పక్కకు వెళ్లిపోయారని ఆయన ప్లేస్ లో వెంకట్ బోయిన పల్లి ఈ భారీ ప్రాజెక్ట్ ని తలకెత్తుకున్నారని అంటున్నారు.