భారీ బడ్జెట్ తో వస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పై రాజమౌళి తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. బాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు కూడా. అందుకే సినిమాపై అంత పట్టింపుతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ కొత్త గెటప్ లలోకి వచ్చారు. అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈ గెటప్స్ మార్చకూడదని హీరోలిద్దరికీ కండిషన్ పెట్టారట రాజమౌళి. సినిమా రిలీజ్ వరకు ఈ గెటప్స్ అలాగే వుంచాలని, హీరోలిద్దరినీ తాను ప్రమోషనల్ టూర్‌కి తీసుకెళతానని రాజమౌళి చెప్పాడట.