హైపర్ ఆది అల్లాడించాడు. ఆడియన్స్ పల్స్ ని బాగా పట్టుకున్నాడు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి చెప్పే ప్రయత్నం చేశాడు. మోనాల్ తో, సోహైల్ తో తనదైన స్టైల్లో పంచ్ లు వేశాడు. అంతేకాదు, అభిజిత్ తో మాట్లాడుతూ… నువ్వు అఖిల్ మోనాల్ ని చూస్తుంటే మాకు ప్రేమదేశం సినిమా చూసినట్లుగా ఉందంటూ కామెంట్ చేశాడు. ఇక డిటెక్టివ్ గా వచ్చి హౌస్ మేట్స్ మనసులో మాటల్ని బయటపెట్టాడు. అరియానా – అవినాష్ లతో కూడా ఆడుకున్నాడు. హారికని అయితే బ్రహ్మానందంతో పోల్చుతూ పంచ్ లు వేసాడు. ఇలా హైపర్ ఆది వచ్చినప్పటి నుంచీ ఎపిసోడ్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అంతేకాదు, ఇప్పుడు హైపర్ ఆది బిగ్ బాస్ షో యాంకరింగ్ చేస్తే అద్దిరిపోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి కూడా.