రేయ్ విషయంలో జరిగినట్లే తమ్ముడు వైష్ణవ్ చేస్తున్న ఉప్పెన సినిమా విషయంలో నూ జరగనున్నట్లు తెలుస్తుంది.. స్టార్ డైరెక్టర్‌గా ఉన్న వైవీఎస్ చౌదరిని నమ్మి రంగంలోకి దిగితే ‘రేయ్’ సినిమా మొదలయ్యాక.. పూర్తి కావడానికి, విడుదల కావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టేసింది. ఈ సినిమా సంగతి ఎటూ తేలక తేజు ఎంత ఆవేదన చెంది ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు తేజు తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్‌ను కూడా తొలి సినిమా గండం వెంటాడుతుండటం గమనార్హం.ఉప్పెన ఓటీటీ రిలీజ్ కోసం కొన్ని ఆఫర్లు వచ్చినా అరంగేట్ర హీరో సినిమాను అలా రిలీజ్ చేస్తే బాగోదని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఆగుతున్నారు. ఈలోపు వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా రిలీజ్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు..