తెలుగులో ఎన్ని వెబ్ సిరీస్ లు విడుదలవుతున్నా.. ఇక్కడి ప్రేక్షకులందరూ ‘మీర్జాపూర్2’ వెబ్ సిరీస్ కోసమే ఎదురుచూస్తూ వచ్చారు. చెప్పుకోవడానికి ‘మీర్జాపూర్ సీజన్1’ కొత్త కథేమీ కాదు. కానీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే బోలెడంత బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ను అనేక భాషల్లో డబ్బింగ్ చేశారు. అయితే తెలుగులోనే బాగా హిట్ అయ్యింది. దానికి ప్రధాన కారణం.. ఈ వెబ్ సిరీస్ కు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా కుదరడం.. ఎక్కువ శాతం బూతులు ఉండడం.