హీరో మహేష్ బాబు, రామ్.. త్రివిక్రమ్ తో సినిమా కోసం వేచి చూస్తున్నారని, ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం అయితే మధ్యతో తమకు ఓ సినిమా చేసి పెట్టాలని అడిగారని ఇటీవల టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపించాయి. వాస్తవానికి త్రివిక్రమ్ దగ్గర ఎన్టీఆర్ కి మినహా మిగతా ఎవరికీ కథలు రెడీగా లేవు. ఒకవేళ కథ రెడీ చేసుకుని సెట్స్ పైకి వెళ్లాలనుకుంటే పెద్ద తతంగనే నడవాలి. ఆలోగా ఎన్టీఆర్ ఖాళీ అయి వచ్చేస్తే అప్పుడు త్రివిక్రమ్ ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారని సమాచారం.