బిగ్ బాస్ వేదికపై సొంత విషయాలు కూడా పంచుకుంది సమంత.మోనాల్ విషయంలో కూడా చిన్నసైజ్ క్లాస్ తీసుకుంది సమంత.  ఇంట్లో ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తూనే ఉంటుంది మోనాల్. అది చాలా మందికి నచ్చదు కూడా.. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. ఆమెను ఏడుపు ఆపాలంటూ నాగార్జున కూడా చాలాసార్లు చెప్పాడు. కానీ వినలేదు.. ఇప్పుడు సమంత కూడా చెప్పింది. కాకపోతే తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది సమంత. చీటికి మాటికి వచ్చే ఏడుపుకు అస్సలు విలువ ఉండదంటూ కాస్త గట్టిగానే చెప్పింది సమంత.అలా చేయొద్దని.. ఊరికే ఏడవొద్దని.. అలా చేసినపుడు ఎదుటి వాళ్లకు కోపం వస్తుందని.. అదే ఎందుకు ఏడుస్తున్నామో క్లియర్‌గా మాట్లాడి సమస్యను సాల్వ్ చేసుకుంటే బాగుంటుందని మోనాల్‌కు సమంత సూచించింది.  తన ఇంట్లోనూ నాగ చైతన్య కోప్పడతాడని.. తమ మధ్య గొడవలు కూడా అవుతుంటాయని పర్సనల్ విషయాలను చెప్పింది సమంత. ఆ సమయంలో తాను ఏడిస్తే ఇంకా కోప్పడతాడని చెప్పుకొచ్చింది. అదే క్లియర్‌గా విషయం ఏంటో చెబితో అర్థం చేసుకుంటాడని.. గొడవ అక్కడితోనే సమసిపోతుందని చెప్పుకొచ్చింది సమంత.