నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ పాత్ర కు సంబంధించిన టీజర్ ఇటీవల అక్టోబర్ 22 న కొమురం భీం జయంతి సందర్భంగా విడుదల చేసింది మూవీ యూనిట్. రామ్ చరణ్ వాయిస్, ఎన్టీఆర్ విజువల్స్ ఆడియన్స్‌కు మంచి ట్రీట్ అందించాయి.  రికార్డుల మోత మోగిస్తున్న ఈ టీజర్‌ని కొందరు కుర్రాళ్ళు యధావిధిగా దింపి అందరిని షాక్‌కు గురిచేశారు.రామ్ చరణ్ ప్రోమోను కూడా అచ్చం దింపేయగా, వీరి టాలెంట్‌కు ఫిదా అయిన ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్లో వీడియోలను షేర్ చేసింది.కుర్రాళ్ళు చింపేశారు అని కామెంట్లో పేర్కొంది.ఇక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ స్పూఫ్ కి ఫిదా అవుతూ... అచ్చం ఎన్టీఆర్ ని దించేసాడు అంటూ ఆ కుర్రాడ్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు.