ఆర్ఆర్ఆర్ మూవీలో వివాదానికి కారణమైన సన్నివేశాల్ని తొలగించాలనే డిమాండ్లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అయితే రాజమౌళి మాత్రం వెనక్కి తగ్గుతారా లేదా అనేది డౌటే. ఇప్పటికే ఎన్టీఆర్ కి సంబంధించి ముస్లిం గెటప్ లో ఉన్న సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందట. దీన్ని ఇప్పుడు తిరిగి మార్చాలంటే కుదరదని, అందుకే రీ షూటింగ్ చేసే ప్రసక్తే లేదని సినిమా వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. గొడవ మరీ ముదిరి అసలుకే ఎసరు వస్తుందనుకుంటే రీ షూటింగ్ తప్పని వ్యవహారం అవుతుంది. లేదా సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయగలం అనే ధైర్యం ఉంటే మాత్రం రాజమౌళి ఆ సన్నివేశాల్ని అలాగే ఉంచుతారు.