అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో పవన్ కల్యాణ్ ఫిక్స్ అయిన తర్వాత మరో హీరో రానాని మారుస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి ఓ నెగెటివ్ సెంటిమెంట్ కూడా అడ్డుపడుతోందని అంటున్నారు. గతంలో పవన్ కల్యాణ్, వెంకటేష్.. గోపాల గోపాల సినిమాలో కలసి నటించారు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అప్పటినుంచి పవన్ కల్యాణ్ కు మల్టీస్టారర్ మూవీలంటే కాస్త కష్టంగానే ఉంది. అందులోనూ వెంకటేష్ కుటుంబానికే చెందిన రానాతో మరో సినిమా అంటే ఆ నెగెటివ్ సెంటిమెంట్ ని కొనసాగించడమేనని అనుమానిస్తున్నారు.