అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ షేక్ ఆరిజ్ అహ్మద్ తన స్వస్థలం ప్రకాశం జిల్లా పొదిలికి వచ్చారు. ఈ సందర్భంగా పొదిలి పట్టణంలోని వాలంటీర్లు, సచివాలయానికి సంబంధించిన సిబ్బందితో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. పంచాయతీ డీఈ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. వాలంటీర్ల విధులు, సచివాలయ సిబ్బంది విధులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానం అమలులోకి తేవాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.