పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ తన కెరీర్లో సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు.ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్‌ను ప్రశ్నించగా.. ఆయన షాకింగ్ ఆన్సర్ చెప్పారు. `ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలంతా సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ, నాకు సిక్స్ ప్యాక్‌పై ఇంట్రస్ట్ లేదు. నేను ధైర్యం అనే బలం కోసం పని చేస్తాను. కండలు ఎవరైనా పెంచొచ్చు. కానీ గుండె ధైర్యాన్ని పెంచుకోవడం చాలా కష్టం. ఓ రాజకీయ నేతగానూ నేను ప్రజల్లోకి వెళ్లడానికి ఆ ధైర్యం చాలా అవసరం` అని పవన్ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.