నాగశౌర్య హీరోగా `అలా ఎలా?` ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 4 గా ఉష ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఈ రోజు హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ నివ్వగా, హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి స్క్రిప్ట్‌ను దర్శకుడు అనీష్ కృష్ణకు అందజేశారు.