రానున్న రోజుల్లో కుడి బిగ్ బాస్ హౌస్ లో సమంత హవానే కొనసాగనుందట.ఇక తాజా సమాచారం ప్రకారం నాగార్జున కొత్త సినిమా షెడ్యూల్లో భాగంగా మరో 20 రోజులు షూటింగ్ నిమిత్తం మనాలీలోనే ఉండబోతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే రానున్న మూడు ఎపిసోడ్లలో కూడా సమంతానే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంత దసరా ఎపిసోడ్‌తో కలిపి మొత్తం ఐదు ఎపిసోడ్లు చేయనుందని సమాచారం. ఇందుకోసం బిగ్‌బాస్ టీమ్ సమంతకు ఏకంగా రూ.2.10 కోట్లు అప్పజెపుతున్నట్లు తెలుస్తోంది.  అంటే ఒక్క షోకి సమంత తీసుకునేది రూ.40 లక్షలకుపైమాటే అన్నమాట. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ సీజన్4 మొత్తానికి నాగ్ రూ.8 కోట్లు తీసుకోనున్నాడు.కానీ సమంత మాత్రం కేవలం 4 ఎపిసోడ్లకే రూ.2 కోట్లు తీసుకుంటుండడం విశేషం.