RRR కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ తాలూకు టీజర్ విడుదలైంది. టీజర్ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చేసింది. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అందరూ. కానీ టీజర్ చివర్లో తారక్ తలపై టోపీ పెట్టుకుని ముస్లిం వేషధారణలో కనిపిస్తారు. ఇదే వివాదానికి దారితీసింది. నిజాం రాజుల మీద, రజాకార్ల మీద యుద్ధం చేసిన భీమ్ ఇలా ముస్లిం టోపీ పెట్టుకుని కనిపించడం ఏమిటని ఆదివాసీలు మండిపడుతున్నారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని, చరిత్రను వక్రీకరిస్తే సినిమా విడుదలయ్యాక థియేటర్ల మీద దాడిచేస్తామని ఆదివాసీలు హెచ్చరిస్తున్నారు. కానీ సినిమాలో కొమురం భీమ్ ప్రతిష్టకు భంగం కలిగించే సన్నివేశాలేవీ ఉండవని, సినిమా చూసాక ఎన్టీఆర్ తలా మీద టోపీ ఎందుకు ఉందనేది అర్థమవుతుందని చిత్ర సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అలాగే సినిమాలో భీమ్ పాత్ర అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ముస్లిం వేషధారణలో ఉంటారని, వాటిని తొలగించడం కుదరదని కూడ తెలుస్తోంది.