పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం శాటిలైట్ రైట్స్ ని తెలుగు టెలివిజన్ టాప్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నట్టుగా టాక్. అయితే ఓ కండీషన్ పెట్టారట. డిజిటిల్ స్ట్రీమింగ్ లేటు చేస్తామని, అందుకు ఓటీటిలతో మాట్లాడతామని హామీ ఇవ్వమని అడిగారంటున్నారు. ఎందుకంటే ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజవడం అవ్వగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసేస్తున్నారు. మధ్యలో యాడ్స్ తలనొప్పి లేకపోవటం, హెడ్ డీ క్వాలిటీ ఉండటం కలిసొస్తోంది.దీంతో ఆ తర్వాత టీవీలో సినిమా రిలీజైతే పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు.  ఆ మధ్య కాలంలో నవీన్ చంద్ర సినిమా 'భానుమతి రామకృష్ణ' , సత్యదేవ్ 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' టీవిల్లో కూడా ఆశించిన స్పందన లేదు. ఈ నేపథ్యంలో శాటిలైట్ మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలంటే ఇలాంటి ఓ కండీషన్ తప్పనిసరి అని భావిస్తున్నారట. ఇక వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ రూ. 15 నుంచి రూ. 17 కోట్ల వరకు రేటు ఫిక్సైనట్లు వినపడుతోంది.ఇదే కండీషన్ మీద సన్ నెట్ వర్క్ వారు ఈ హక్కులను కూడా వారు భారీ ధరకే కొనుగోలు చేసినట్టుగా వినికిడి.